కంటకాపల్లి రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపండి: రైల్వే బోర్డు చైర్‌పర్సన్‌కు ఎంపీ జీవీఎల్ విజ్ఞప్తి

by Seetharam |
కంటకాపల్లి రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపండి: రైల్వే బోర్డు చైర్‌పర్సన్‌కు ఎంపీ జీవీఎల్ విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రైల్వే బోర్డు చైర్‌పర్సన్ జయవర్మ సిన్హాను ఎంపీ జీవీఎల్ నరసింహరావు మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్‌పర్సన్ జయవర్మ సిన్హాను కలిసి విశాఖపట్నం పార్లమెంటులోని కొత్తవలస దగ్గర జరిగిన రైలు ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైలు భద్రతా సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు రైల్వే చైర్‌పర్సన్ అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా గత ఐదు నెలల్లో రెండు పెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైలు భద్రతపై సమగ్ర సమీక్ష జరపాలని ఎంపీ జీవీఎల్ కోరారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైల్వే భద్రతను పటిష్టం చేసేందుకు అన్ని చర్యలు త్వరితగతిన తీసుకుంటామని చైర్‌పర్సన్ జయవర్మ సిన్హా ఎంపీ జీవీఎల్‌కు హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed