ఏపీ రాజధాని అమరావతిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-06-27 16:38:34.0  )
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌కు అమరావతి పోటీ కాదని ఆయన తెలిపారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. తన పాలనలో జగన్ తరహా కక్ష సాధింపులు ఉండవని స్పష్టం చేశారు. కక్ష సాధింపులతో పాలన చేస్తే ఏం జరుగుతుందో ఏపీ ప్రజలు చూపించారని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి తప్పుడు నిర్ణయాలను తాను అడుగులు వేయనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం పాలన సాగిస్తున్నారు. హైదరాబాద్ భసవతారకంలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఏపీలో చంద్రబాబు 18 గంటలు పని చేస్తుంటే తాను 12 గంటలే పని చేస్తున్నానని రేవంత్ రెడ్ది తెలిపారు. ఇక నుంచి తాను కూడా 18 గంటలు పని చేస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిలో పోటీ పడాలని సీఎం ఆకాంక్షించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ 2019లో ఏపీలో అధికారం చేపట్టిన జగన్ పాలనపై సున్నితంగా విమర్శిస్తూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed