CM Jagan: జగన్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలని చూస్తున్నారు: మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

by Shiva |
CM Jagan: జగన్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలని చూస్తున్నారు: మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌మోహన్ రెడ్డిని ఎలాగైనా మట్టుబెట్టాలని చూస్తున్నారంటూ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అధినేతపై దుండగులు దాడికి పాల్పడినందుకు గాను ఆయన ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో వైసీపీ నేతలు నల్ల జెండాలతో ర్యాలిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అద్భుతమైన సంక్షేమ పథకాలతో ప్రజాధరణ పొందుతున్న జగన్‌పై ఎవరికో కన్ను కుట్టిందని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని. సీఎం జగన్‌ను నేరుగా ఎదుర్కొలేకే చంద్రబాబు దొంగ చాటుగా దాడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ విజయవాడలో ఓ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న వంగవీటి మోహన రంగాను టీడీపీయే హత్య చేయించిందిని, ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని కూడా అనేక ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. ఓ పార్టీ ఎదుగుతుంటే చూసే తత్వం చంద్రబాబుది కాదని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దాడులు హేయమని ధ్వజమెత్తారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఏపీలో మళ్లీ జగన్ ప్రభుత్వమే కొలువుదీరబోతోందని జోస్యం చెప్పారు. చంద్రబాబు పార్టీకి డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని అన్నారు.

Advertisement

Next Story