మీకు నేనున్నా.. డోంట్ వర్రీ.. ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ సంచలన హామీ

by srinivas |   ( Updated:2024-05-04 13:03:57.0  )
మీకు నేనున్నా.. డోంట్ వర్రీ.. ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ సంచలన హామీ
X

దిశ, వెబ్ డెస్క్: ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తానంటుందని, ఆరునూరైనా ఉండి తీరాల్సిందేనన్నారు. ముస్లింల రిజర్వేషన్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని సీఎం జగన్ తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష నాయకులు మోడీ ముందు చెప్పగలరా అని నిలదీశారు. ఈ విషయంలో ఎన్డీయే కూటమి నుంచి బయటకు రాగలరా అని ప్రశ్నించారు. మత ప్రాతిపదికన ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదని తెలిపారు. అన్నీ మతాల్లోనూ బీసీలు, ఓసీలు ఉన్నారని చెప్పారు. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఇలాంటి అంశాల్లో ప్రజల జీవితాలతో చెలగాటమాడటం మంచికాదని హెచ్చరించారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ విషయాల్లో మైనార్టీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ముస్లింలు ధైర్యంగా ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

Read More..

ఏపీలో అభివృద్ధిపై దుష్ప్రచారం.. సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం

Advertisement

Next Story