CMకి ఇక్కడి అర్తనాదాలు వినిపించవు..జగన్‌పై ఘాటు విమర్శలు చేసిన షర్మిల

by Jakkula Mamatha |   ( Updated:2024-05-26 13:14:33.0  )
CMకి ఇక్కడి అర్తనాదాలు వినిపించవు..జగన్‌పై ఘాటు విమర్శలు చేసిన షర్మిల
X

దిశ,వెబ్‌డెస్క్: సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు విమర్శలు గుప్పించారు. లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న సీఎం జగన్‌కు రాష్ట్రంలో జరుగుతున్న ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. ఏపీలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆమె కుటుంబ సభ్యులను బ్లాక్ మెయిల్ చేయడం పై షర్మిల మండిపడ్డారు. ‘నా అక్క చెల్లెమ్మలూ అని మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమ నటించే ముఖ్యమంత్రి గారు మీ పాలన గురించి దేశం చేప్పుకోంటుంది అన్నారు. ఈ నేపథ్యంలో 13 ఏళ్ల ఓ విద్యార్థిని అత్యాచారానికి సంబంధించిన న్యూస్ క్లిప్‌ను షేర్ చేస్తూ సీఎం జగన్‌కు షేర్ చేస్తూ ఆమె విమర్శలు గుప్పించారు. మీ పాలన మహిళల భద్రతకు, బతుకులకు పట్టిన పీడ అని దేశమంతా చెప్పుకుంటోంది అని ట్వీట్ చేశారు.

Click Here For Twitter Post..



Next Story

Most Viewed