Chandrababu: ఏపీలో వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష!.. అప్రమత్తంగా ఉండి డైనమిక్ గా పని చేయాలి

by Ramesh Goud |
Chandrababu: ఏపీలో వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష!.. అప్రమత్తంగా ఉండి డైనమిక్ గా పని చేయాలి
X

దిశ, డైనమిక్ బ్యూరో: విపత్తులు వచ్చినప్పుడే అధికారుల సమర్ధత బయటపడుతుందని, పూర్తి అప్రమత్తతో ఉండి డైనమిక్ గా పని చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏపీ లో కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించిన ఆయన 8 జిల్లాలు కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. 185 ఎమ్ఎమ్ కు గాను 244 ఎమ్ఎమ్ వర్షపాతం నమోదు అయ్యిందని, 31 శాతం అదనపు వర్షపాతం నమోదు అయ్యిందని చెప్పారు. అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్పమత్తం చేయడం ద్వారా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడవచ్చని అన్నారు.

చెరువులు, వాగులల్లో వరద ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇసుక మట్టి తవ్వకాల వల్ల గోదావరి ఆనకట్టలు బలహీనంగా మారాయని, వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్ధత బయటపడుతుందని, అధికారులు అప్రమత్తతో ఉండి, డైనమిక్ గా పని చేయాలని పలు సూచనలు చేశారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వరదల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed