CM Chandrababu:రేపు ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు

by Jakkula Mamatha |
CM Chandrababu:రేపు ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) రేపు ముంబై వెళ్లనున్నారు. ఆజాద్ మైదానంలో జరిగే మహారాష్ట్ర సీఎం(Maharashtra CM), మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ముంబై రావాలని ఎన్డీయే నేతల నుంచి ఆహ్వానం అందడంతో ఆయన పర్యటన ఖరారైంది. ఈ క్రమంలో రేపు(డిసెంబర్ 5) ప్రధాని మోడీ, ఇతర నేతల సమక్షంలో మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదాన్‌(Azad Maidan)లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. కొత్త ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు ఉపముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరగనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi), కేంద్ర మంత్రులు అమిత్ షా, జె.పి.నడ్డా, నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు పంపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed