మహాత్ముడు ప్రాతఃస్మరణీయుడు.. సీఎం చంద్రబాబు ఘన నివాళి

by srinivas |   ( Updated:2025-01-30 03:53:11.0  )
మహాత్ముడు ప్రాతఃస్మరణీయుడు.. సీఎం చంద్రబాబు ఘన నివాళి
X

దిశ, వెబ్ డెస్క్: నేడు మహాత్మాగాంధీ వర్థంతి(Mahatma Gandhi Death Anniversary). భారత దేశ జాతి పిత గాంధీని 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే(Nathuram Godse) హత్య చేయబడ్డారు. నేడు గాంధీ 77వ వర్థంతి. ఇవాళ అమరవీరుల దినోత్సవం కూడా. దీన్ని షహీద్ దివస్ అని కూడా అంటారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుని నివాళులర్పించే రోజు కూడా ఇదే. దేశం కోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన గాంధీకి ఈ రోజు దేశం ఘన నివాళులర్పిస్తుంది ఢిల్లీ రాజ్ ఘాట్(Delhi Raj Ghat) వద్ద రాష్ట్రపతి ముర్ము(President Murmu)తో పాటు ప్రధాని మోడీ(Prime Minister Modi) నివాళులర్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ముఖ్యమంత్రులు నివాళుర్పించనున్నారు. హైదరాబాద్ బాపు ఘాట్ వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana Cm Revanth Reddy) ఈ ఉదయం 10.30 గంటలకు నివాళులర్పించనున్నారు.

గాంధీజీకి ఘన నివాళి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu) ఇప్పటికే గాంధీజీకి నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవను స్మరించుకున్నారు. అహింసను పరమ ధర్మంగా చెప్పిన మహాత్ముడు ప్రాతఃస్మరణీయుడు అని కొనియాడారు. గాంధీ బోధనలు నేటికీ అనుసరణీయమని, జాతి పిత‌కు మరొక్కసారి ఘన నివాళి అర్పిస్తున్నానానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

మహనీయుడి చరిత్ర

కాగా జనవరి 30, 1948న, మహాత్మా గాంధీ తన మనవరాళ్లతో కలిసి ఢిల్లీ బిర్లా భవన్‌‌ ప్రార్థనా సమావేశంలో ప్రసంగించడానికి వెళుతున్నారు. ఈ సమయంలో నాథూరామ్ గాడ్సే గాంధీపై కాల్పులు జరిపారు. గాంధీ ఛాతీలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో గాంధీజీ అక్కడికక్కడే కూలి పోయి ప్రాణాలు వదిలారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది గాంధీ పుణ్యతిథిని వర్ధంతిగా దేశ ప్రజలు జరుపుకుంటున్నారు. దేశానికి గాంధీ చేసిన సేవలను స్మరించుకుంటారు

గాంధీ ప్రాయుఖ్యత

శాంతి, అహింసను ఆచరించేలా ప్రతి ఒక్కరి మనస్సులను ప్రభావితం చేశారు. దీంతో దేశమంతటా ఆయన ప్రసిద్ధి చెందారు. సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం మరియు చంపారన్ సత్యాగ్రహంతో సహా చాలా స్వాతంత్ర్య ఉద్యమాలకు గాంధీజీ నాయకత్వం వహించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టారు. సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్‌లోని దండి వరకు మార్చ్‌ను కొనసాగించారు.

దేశవ్యాప్తంగా ఘన నివాళులు

అంతటి మహనీయుడు గాంధీజీ. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతాయి. ప్రభుత్వ అధికారులు, నాయకులు, పౌరులు స్వాతంత్ర్య సమరయోధుల స్మారక చిహ్నాలు, విగ్రహాల వద్ద నివాళులర్పిస్తున్నారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

Next Story