రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తాం: సీఎం చంద్రబాబు

by Jakkula Mamatha |   ( Updated:2025-03-08 15:33:14.0  )
రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తాం: సీఎం చంద్రబాబు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) నేడు(శుక్రవారం) ప్రకాశం జిల్లా(Prakasam District)లోని మార్కాపురం(Markapuram)లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మార్కాపూరాన్ని ప్రత్యేక జిల్లా చేస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) మరోసారి స్పష్టం చేశారు. ఈ పట్టణం చుట్టూ 250కి పైగా గ్రామాలు ఉన్నాయని, వాటన్నింటికీ ఇదే పెద్ద పట్టణం అని ఓ యువతి చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. మార్కాపూరన్ని జిల్లా చేస్తానని ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చానని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా మార్కపూరాన్ని జిల్లా కేంద్రం చేస్తాం అన్నారు.

అంతేకాదు మార్కాపురన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అలాగే ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు హామీలు అమలు చేసినట్లు సీఎం తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ వయసులో ఇంత ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? అని ఓ వైద్య విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సీఎం చంద్రబాబు ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పనిలోనే ఉంటా. మీ కన్నా చురుగ్గా, కొంత మంది యువకుల కన్నా ముందు చూపుతో ఆలోచిస్తా. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. చాలావరకు మందులకు అలవాటు పడకూడదు’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.


Read Also..

Cm Chandrababu: ఎమ్మెల్యే కందులపై సీరియస్.. స్ట్రాంగ్ వార్నింగ్

Next Story

Most Viewed