తల్లికీ, చెల్లికి ఆస్తిలో వాటా.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2025-03-12 07:52:10.0  )
తల్లికీ, చెల్లికి ఆస్తిలో వాటా.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ‘‘అన్నా చెల్లెళ్ల బంధం టీడీపీది.. 40 ఏళ్లుగా ఉంది.. శాశ్వతంగా ఉంటుంది’’ అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు(Cm Chandrababu) తెలిపారు. ఆడవారికి సమాన హక్కు కల్పించడమే తెలుగుదేశం(Telugu Desam) పార్టీ సిద్ధాంతమని ఆయన తెలిపారు. ఆర్థికంగా. సామాజికంగా మహిళలను పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల మహిళలపై చిన్న చూపు ఉందని చెప్పారు. మహిళలకు ఏం తెలియదని, అలా ఉండండి అని ఇంకా మాట్లాడుతూనే ఉన్నారన్నారు. ఆడవాళ్లు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులపై, పెళ్లి అయితే భర్తపై, వృద్ధులయిన తర్వాత కొడుకులపై ఆధారిపడి ఉన్నారని తెలిపారు. మహిళా సాధికారిత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనేనని గర్వంగా చెబుతున్నామన్నారన్నారు. మహిళకు ఆస్తిలో సమాన హక్కు సర్గీయ ఎన్టీఆర్ కల్పించారన్నారు.

ఆస్తుల్లో తల్లికీ, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకూ అసెంబ్లీలో కూర్చుకున్నారని జగన్‌(Jagan)ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు చేశారు. రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారి తనం మనమని చెప్పారు. మహిళలకు వాటా ఇవ్వాలన్నది కనీస సభ్యత అని వ్యాఖ్యానించారు. మహిళల్లో విద్యను ప్రోత్సహించించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ప్రతి కిలో మీటర్‌కు ఓ ఎలిమెంటరీ స్కూలు, మూడు కిలో మీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూలు, ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక హైస్కూలు, మండలానికి ఓ జూనియర్ కాలేజీ, ప్రతి డివిజన్‌కు ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని తెలిపారు. పబ్లిక్ పాలసీలు చాలా పవర్ ఫుల్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story

Most Viewed