- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Cm Chandrababu: పేద కుటుంబానికి స్వయంగా సీఎం చంద్రబాబు పింఛన్ అందజేత

X
దిశ, వెబ్ డెస్క్: సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఓ పేద కుటుంబం ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. వారింట్లో ఇద్దరికి స్వయంగా పెన్షన్ డబ్బులను అందజేశారు. అనంతరం వాళ్ల ఫ్యామిలీని అప్యాయంగా పలకించారు. ఎవరు ఏం చేస్తున్నారో కనుక్కున్నారు. పిల్లలు ఏం చదువుకున్నారని అడిగారు. కాళ్లకు మొక్కపోతే వద్దని చెప్పారు. ‘నువ్వు నా కాళ్లు పట్టుకుంటే నేను పట్టుకోవాల్సి వస్తుంది.’ అని తెలిపారు. వారితో కలిసి చంద్రబాబు గ్రూపు ఫొటోలు దిగారు. తాము ఆర్థికంగా కష్టాల్లో ఉన్నామని, తమకు ఉపాధి కల్పించాలని సీఎం చంద్రబాబును ఆ కుటుంబ సభ్యులు కోరారు. వెంటనే కలెక్టర్‌ను పిలిచి వారు ఆర్థికంగా ఎదిగేందుకు ఏం చేయాలో అది ఆలోచించి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బందితో పాటు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Next Story