- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu)వరద సహాయ చర్యల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. విజయవాడకు (Vijayawada)వరదలు వచ్చి నేటితో ఆరు రోజులు అవుతోంది. అప్పటి నుంచి కూడా ఆయన వరద ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నారు. వరద (Floods) పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షిస్తున్నారు. తాజాగా కూడా వరద పరిస్థితులపై ఆరా తీశారు. విజయవాడ కలెక్టరేట్ నుంచి మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను అడిగి తెలుసుకున్నారు. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లల్లో త్వరగా క్లీనింగ్ పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
బుడమేరు వాగు (Budameru Wagu) గండ్లు పూడ్చివేత పనుల పురోగతిని సీఎం తెలుసుకున్నారు. గండ్లుపూడ్చి వేత కార్యక్రమంలో భారత ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం తీరును అడిగి తెలుసుకుకున్నారు. యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టి ఇప్పటికే రెండు గండ్లు పూడ్చినట్లు చంద్రబాబుకు అధికారులు వివరించారు. అత్యంత క్లిష్టంగా ఉన్న మూడో గండి పూడ్చివేత పనులను ఆర్మీ అధికారుల సహకారంతో వేగంగా చేపడుతున్నట్లు సీఎంకు తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో మూడో గండి పూడ్చివేత పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. కరెంట్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్దరణ, ట్యాంకర్లతో తాగునీటి సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు నిత్యావసరాల పంపిణీపైనా ఆరా తీశారు. ఇప్పటికే ప్యాకింగ్ పూర్తి చేసి బాధితులకు అందిస్తున్నట్లు తెలిపిన అధికారులకు.. వాహనాలు, ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్లను పిలిపించాలని సూచించారు. అవసరం అయితే కొంత పారితోషికం ఇచ్చి అయినా మెకానిక్ లను, టెక్నీషియన్లను ఇతర ప్రాంతాలనుంచి తీసుకురావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.