ఐఆర్ఆర్ కేసులో పుట్టని బిడ్డకు పెళ్లి చూపులు అన్నట్లు సీఐడీ తీరు: ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

by Seetharam |   ( Updated:2023-09-27 12:07:57.0  )
ఐఆర్ఆర్ కేసులో పుట్టని బిడ్డకు పెళ్లి చూపులు అన్నట్లు సీఐడీ తీరు: ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
X

దిశ, డైనమిక్ బ్యూరో : కొడుకు బాగుండాలి-కోడలు భర్తని కోల్పోవాలి అన్నట్లు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ తీరు ఉంది అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ఐఆర్ఆర్‌పై సీఐడీ హడావుడి కేవలం వైసీపీ కుట్ర అని అభివర్ణించారు. ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ శాసనసభ పక్షం బుధవారం మాక్ అసెంబ్లీ నిర్వహించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు- వాస్తవాలు అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేదు అని చెప్పుకొచ్చారు. ఆ పనిని మొదలు పెట్టలేదు. ఏ రకమైన బడ్జెట్‌ను కేటాయించలేదు. 2018 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ ఇవ్వడంతోనే ఆగిపోయింది అని టీడీపీ శాసనసభా పక్షం తెలిపింది. పుట్టని బిడ్డకు పెళ్లి చూపులు అన్నట్లు.. వేయని రోడ్డుకు రూ.2400 కోట్లు లబ్ధి అంటున్నారు అని ఆరోపించారు. వేల కోట్లు విలువ ఉన్న హెరిటేజ్‌కు రూ.8 కోట్ల లాభమనడం హాస్యాస్పదం అన్నారు. 350 ఎకరాలు లింగమనేనికి ఉంటే.. 15 ఎకరాలకు పక్కగా రోడ్డు వెళుతుందని చెప్పడం అవివేకం కాకపోతే ఇంకేమిటి అని అన్నారు. 6 కిలోమీటర్ల అవతల ఉన్న రామకృష్ణా హౌసింగ్ వారికి ఎలా లబ్ధి చేకూరింది అని చెప్పుకొచ్చారు. 2013లో తీసుకున్న రామకృష్ణా హౌసింగ్ భవన నిర్మాణ అనుమతులకు సింగపూర్ సంస్థతో కుట్ర చేశారన్న ఒక్క ఆరోపణ కైనా ఆధారం కానీ, చేసిన వారికి జ్ఞానం ఉన్నట్లుగా కానీ కనిపించట్లేదు అని చెప్పుకొచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డుపై వైసీపీ చేసేది కేవలం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు మాత్రమేనని పంచుమర్తి అనురాధ చెప్పుకొచ్చారు. ‘హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు టోల్ గేట్లను వేలం వేస్తే రూ.7380 కోట్లు వచ్చింది. అభివృద్ధి అంటే అర్థమయ్యే వారికి ఈ ప్రణాళికల విలువ తెలుస్తుంది అని అన్నారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డుపై ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు ఇస్తే సీఐడీ వెంటనే కేసు నమోదు చేసింది అని చెప్పుకొచ్చారు. కొడుకు బాగుండాలి-కోడలు భర్తని కోల్పోవాలి అన్నట్లు సీఐడీ తీరు ఉంది అని పంచుమర్తి అనురాధ అన్నారు. హెరిటేజ్ సంస్థ అమరావతికి 30కి.మీ దూరంలో భూమి కొంటే ఇన్నర్ రింగురోడ్డుకు దానిని లింక్ పెట్టడం అర్ధరహితమన్నారు. రాష్ట్ర విభజనకు ముందే భూమి కొనుగోలు చేసిన హెరిటేజ్ సంస్థకి ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా లబ్ది ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. 1980 నుంచి భూములు ఉన్న లింగమనేని సంస్థకు ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల 14 ఎకరాలు కోల్పోతుందని కోర్టుకు ఆఫడివిట్ ఇచ్చింది అని చెప్పుకొచ్చారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల లబ్ధి చేకూరితే నాటి సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌పై కేసు ఎందుకు పెట్టలేదు అని నిలదీశారు. క్విడ్ ప్రోకో, ఇన్‌సైడర్ ట్రేడింగ్ లాంటి పదాలను తన కేసుల ద్వారా పరిచయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ బురదను తెలుగుదేశానికి అంటకట్టడం తప్ప మరొకటి కాదు అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అని చెప్పుకొచ్చారు.

Read More Latest updates of Andhra Pradesh News

Advertisement

Next Story