- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు.. శ్రీవారి సన్నిధిలో స్పష్టం చేసిన వైసీపీ ఎంపీ
దిశ, డైనమిక్ బ్యూరో : ‘దేశంలో బీజేపీ బలంగా ఉంది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి అవసరం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి కూడా లేదు’ అని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 300 పైగా ఎంపీలు ఉండటంతో.. మనం ఎంత చెప్పినా ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు అని క్లారిటీ ఇచ్చేశారు. అయినప్పటికీ ప్రత్యేక హోదాపై పార్లమెంటులో 21 మంది లోక్ సభ ఎంపీలు, 8 మంది రాజ్యసభ సభ్యులం పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పుకొచ్చారు. తిరుమల శ్రీవారిని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయం బయట ఆయన మీడియాతో మాట్లాడారు. అయినా కూడా పోరాటం చేస్తూనే ఉన్నామని, తమ విధి, విధానం కూడా అదే అని బెల్లాన చంద్రశేఖర్ వెల్లడించారు.