ప్రేమ వ్యవహారంలో యువకుడు అనుమానాస్పద మృతి.. ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2024-03-29 11:12:16.0  )
ప్రేమ వ్యవహారంలో యువకుడు అనుమానాస్పద మృతి.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వింజం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులు క్రితం యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందారు. యువకుడి తలపై గాయాలున్నాయి. దీంతో యువకుడు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కుమారుడి ఆత్మహత్య కాదని, ఎవరో హత్య చేశారంటూ శుక్రవారం వింజం రోడ్డుపై కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed