- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Tirumala News:తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూలైన్
దిశ,వెబ్‌డెస్క్:తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవాడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో భక్తుల(devotees) రద్దీ అధికంగా ఉంటుంది. ఆ సమయంలో శ్రీవారి దర్శనానికి కొంత సమయం ఎక్కువగా ఉండవచ్చు. అయితే తాజా సమాచారం ప్రకారం నేడు (మంగళవారం) తిరుమలకు భక్తుల(devotees) రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల(6 hours) సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో(compartments) భక్తులు వేచి ఉన్నారు. ఇక టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా..శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి(Special entrance) 2 గంటల సమయం పడుతుంది. కాగా నిన్న(సోమవారం) తిరుమల శ్రీవారిని 67,030 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,476 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.60 కోట్లుగా ఉంది.