- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందిస్తాం..మంత్రి గొట్టిపాటి రవికుమార్
దిశ,తిరుమల:గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కూడా జరగకపోగా ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి పై దృష్టి సారించామని, రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తిని పెంచిన అనంతరం విద్యుత్ చార్జీలను తగ్గించడం పై నిర్ణయం తీసుకుంటామని మంత్రి రవికుమార్ తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి 45 రోజుల పాటు రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో చాలా భూములు అన్యాక్రాంతం అయ్యాయని, ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే గ్రామంలోని ప్రజల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని. తిరుపతిలో మాజీ మంత్రులు మఠం భూములను ఆక్రమించారని, అన్యాక్రాంతమైన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.