- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తిరుమల శ్రీవారికి మొదటి పెళ్లి కార్డు...
by srinivas |

X
దిశ, తిరుమల: తిరుపతికి చెందిన 2023 బ్యాచ్ ఐఏఎస్ పవన్ దత్త, హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన డాక్టర్, మోడల్ తేజస్విని మనోజ్ఞతో వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 24న వీరికి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమ మొదటి వివాహ ఆహ్వాన పత్రికను తిరుమల వేంకటేశ్వర స్వామి చెంతకు చేర్చి ఆశీస్సులు తీసుకున్నారు. కాగా డాక్టర్ తేజస్విని భారతీయ మోడల్‌తోపాటు అందాల పోటీ టైటిల్ హోల్డర్ కూడా. వృత్తిరీత్యా వైద్యురాలు. డివైన్ మిస్ ఎర్త్ ఇండియా 2019 టైటిల్‌ను కూడా ఆమె గెలుచుకున్నారు. ఫిలిప్పీన్స్‌లోని పరానాక్ సిటీలో జరిగిన మిస్ ఎర్త్ పోటీలో 19వ ఎడిషన్ నందు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
Next Story