- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Pm modi: ‘వంటారా’ను ప్రారంభించిన మోడీ.. సింహం, పులి పిల్లలతో సదరాగా గడిపిన ప్రధాని

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) రిలయన్స్ ఫౌండేషన్ (Reliance foundation) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద వణ్యప్రాణి పునరావాస, సంరక్షణ కేంద్రమైన వంటారా (Vantara) ను ప్రారంభించారు. అనంతరం వైల్డ్ లైఫ్ సెంటర్‌ను సందర్శించారు. జంతువుల రక్షణకు అక్కడ ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. సింహం, చిరుత పులి పిల్లలను ఎత్తుకుని వాటితో సరదాగా గడిపారు. వాటికి ఆహారాన్ని అందజేశారు. జంతువుల కోసం ఏర్పాటు చేసిన పశు వైద్య శాలను సైతం సందర్శించారు. హైవేపై కారు ఢీకొట్టిన తర్వాత చిరుతపులి ప్రాణాలు కాపాడేందుకు దానిని రక్షించి వంటారాకు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. మోడీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), రిలయన్స్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్ అనంత్ అంబానీ కూడా ఉన్నారు. ఈ సెంటర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వన్యప్రాణులను రక్షిస్తుంది.
కాగా, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సుమారు మూడు వేల ఎకరాల్లో వంటారాను నిర్మించారు. ఈ కేంద్రంలో భారత్ మాత్రమే గాక విదేశాల్లో గాయపడిన, అంతరించిపోతున్న జంతువులను రక్షించి చికిత్స చేస్తారు. చికిత్స పూర్తయిన తర్వాత, వారికి పునరావాసం సైతం కల్పిస్తారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. 25,000 కంటే ఎక్కువ వన్యప్రాణులను ఇది కాపాడనుంది. ఇందులో జంతువులకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వంటారాలో 1.5లక్షల జంతువులు ఆశ్రయం పొందుతున్నాయి.