- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: 240 కిలోల గంజాయి పట్టివేత.. 8 మంది అరెస్ట్

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పుష్ప స్మగ్లర్లు ఎక్కువైపోయారు. ఆ సినిమాలో హీరో ఎర్రచందనం దుంగలను కొట్టేసేందుకు తెలివి ఉపయోగిస్తే నిజజీవితంలో కొందరు గంజాయి తరలించేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. అయితే వాటిని పోలీసులు భగ్నం చేస్తున్నారు. దీంతో గంజాయి పుష్పల కాస్త జైలు పాలవుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పుష్ప తీరు ఘటన ఒకటి జరిగింది. 8 మంది ముఠా సభ్యులు గంజాయి తరలించబోయి పోలీసులకు చిక్కారు. బొలేరో ట్రక్ వాహనం పైభాగంలో టమాటాలు సెట్ చేశారు. కింద భాగంలో 240 కిలోల గంజాయి అమర్చారు. పోలీసులకు అనుమానం రావడంతో వాహనాన్ని చెక్ చేశారు. దీంతో గంజాయి ముఠా గుట్టు రట్టు అయింది. బొలేరో వాహనంతో పాటు గంజాయిని సీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. వారంతా తమిళనాడు వాసులుగా తెలిపారు. గంజాయి విలువ రూ. 48 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
Next Story