- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో 100 సీట్లు గెలుస్తాం: గిడుగు రుద్రరాజు
దిశ, తిరుపతి: కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవనం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 100 సీట్లు గెలవడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లిక్కర్, ఎర్ర సందనం, ఇసుక, భూ మాఫియాలతో రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుందని గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని సమస్తాగతంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాణ తాగాల నుంచి వచ్చిన పార్టీ అని ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్టరీ యూనిట్ లాంటిదని, ఆ పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డి , చంద్రబాబు నాయుడు పోవడం జరిగిందని గుర్తు చేశారు. తమకు రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి అని గిడుగు రుద్ర రాజు పేర్కొన్నారు.