- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు పీఏతో పాటు 45 మందిపై కేసు నమోదు
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో షాక్ తగిలింది. చంద్రబాబు పీఏ మనోహర్‌తోపాటు ఏకంగా 45మంది టీడీపీ కార్యకర్తలపై రామకుప్పం పోలీసులు కేసులు నమోదు చేశారు. రామకుప్పం మండలం ఉనిసిగానిపల్లె మాజీ సర్పంచ్ మహాదేవి, ఆమె భర్త జయశంకర్‌లను ఎస్ఐ కృష్ణయ్య దూషించి ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ మాజీ సర్పంచ్ దంపతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎస్ఐ కృష్ణయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం పోలీసు స్టేషన్ ఎదుట నేతలు ఆందోళనకు దిగారు.
ఈ నిరసనల్లో చంద్రబాబు పీఏ మనోహర్ కూడా పాల్గొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ హెడ్ కానిస్టేబుల్ మణి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. పీఏ మనోహర్‌తోపాటు మరో 44 మందిపై రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై ఐపిసి 143, 341, 353, 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది.