సైకో మేనిఫెస్టో అడ్రస్‌ లేకుండా పోయింది..చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula Mamatha |   ( Updated:2024-04-30 15:17:40.0  )
సైకో మేనిఫెస్టో అడ్రస్‌ లేకుండా పోయింది..చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, ఏలూరు:'మన మేనిఫెస్టో అదిరిపోయింది..సైకో మేనిఫెస్టో అడ్రస్‌ లేకుండా కిందికి దిగిపోయింది' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రజాగళం కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.' మాపై, మ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన వారెవరినీ వదిలిపెట్టను ఇప్పుడే హామీ ఇస్తున్నా..వారికి వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాది అని అన్నారు. ఇప్పటి వరకు నా మంచితనాన్ని చూశారు. రాబోయే రోజుల్లో నాలో కఠినత్వాన్ని చూస్తారు అని ఆవేశంగా అన్నారు. ఐదేళ్ళ పాటు ప్రజలకు సేవలందించేందుకు రూపొందించిందే మేనిఫెస్టో అన్నారు. 'నాకేం తెలియదు..అని ఇంట్లో కూర్చుని బటన్లు నొక్కుతా అంటున్నాడు ' అని జగన్‌ను పరోక్షంగా దుయ్యబట్టారు.

బటన్‌ నొక్కడం ఎవరికీ తెలియదా.. ఏం బామ్మా.. నువు బటన్‌ నొక్కలేవా..ఆ పసివాడికి ఐఫోన్‌ ఇస్తే బటన్లు నొక్కుతాడు అన్నారు. కొత్తగా జగన్‌ లాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్ అని తెచ్చాడు. ఈ నల్ల చట్టం వస్తే నీ ఆస్తి నీది కాకుండా పోతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. తాత తండ్రులు ఇచ్చిన ఆస్తి పట్టాలపై సైకో ఫొటోలు వేసుకున్నాడని దుయ్యబట్టారు. పొద్దుటే నిద్ర లేవగానే సైకో ఫొటో కనబడుతుంది. ఈ సైకో కరెంట్‌ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు. రైతులను మోసం చేశాడు. ఐదేళ్ల పాలన చేసి డీఎస్సీ వేశారా అని ప్రశ్నించారు.

నేను ఆయనను హత్య చేయడానికి యత్నం చేశానని అంటున్నాడు. గులకరాయి విసిరామని అంటున్నాడు. ఐదేళ్ళుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఒక ఎస్సి డ్రైవర్‌ను హత్య చేసి డోర్‌ డెలివరి చేసిన వ్యక్తిని పక్కన బెట్టుకున్నాడని చంద్రబాబు ఆరోపించారు. మక్కెలిరగ్గొట్టే వారు లేక నాటకాలాడుతున్నాడు అని ధ్వజమెత్తారు. పోలవరం కాల్వకు అవసరమైతే ఒకట్రెండు లిఫ్ట్‌లు పెట్టి దెందులూరు ప్రజలకు నీరిస్తానన్నారు. అంతకు ముందు టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్‌, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ తదితరులు మాట్లాడారు.

Read More..

పవన్ కల్యాణ్ పిలవాలే కానీ ఎక్కడికైనా వెళ్తా.. సీనియర్ నటి కామెంట్స్ వైరల్

Advertisement

Next Story