చంద్రబాబుకు కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని: మంత్రి కొట్టు సంచలన ఆరోపణలు

by Seetharam |   ( Updated:2023-10-15 05:41:21.0  )
చంద్రబాబుకు కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని: మంత్రి కొట్టు సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు ఏమైనా హాని జరిగితే అందుకు సీఎం వైఎస్ జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు జైల్లో ఎలాంటి ప్రాణహాని లేదని వివరణ ఇచ్చారు. చంద్రబాబుకు కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండే అవకాశం ఉందంటూ సంచలన వ్యాక్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు ఏం జరిగినా దానికి బాధ్యత లోకేశ్, భువనేశ్వరిలదేనని కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. తన కుటుంబ సభ్యులే తనపై కుట్రలు చేసి అంతరం చేస్తారనే భయం చంద్రబాబు నాయుడులో ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. కన్న తండ్రికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచినప్పుడు భువనేశ్వరి ఎందుకు స్పందించలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed