- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నారా రోహిత్‌కు చంద్రబాబు లేఖ..అందులో ఏం ఉందో తెలిస్తే షాక్!

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆయన సోదరుడి కుమారుడు, సినీ నటుడు నారా రోహిత్ భావోద్వేగ భరితంగా ఓ లేఖ రాయడం తెలిసిందే. 40 ఏళ్లుగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కూడా ధైర్యంగా నిలబడ్డారని నారా రోహిత్ ఆ లేఖలో కొనియాడారు.
నారా రోహిత్ లేఖపై చంద్రబాబు నేడు (గురువారం) స్పందించారు. "ప్రియమైన నారా రోహిత్..నీ లేఖ నా మనసును తాకింది. మన కుటుంబ సభ్యుల అండ, ఆశీస్సులు ఎల్లవేళలా నాకు ఉన్నాయి కాబట్టే..ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగాను. నీకు ఎల్లప్పుడూ నా శుభాశీస్సులు వెన్నంటి ఉంటాయి. ప్రేమతో నీ పెదనాన్న" అంటూ చంద్రబాబు బదులిచ్చారు. ప్రజెంట్ ఈ లేఖ వైరల్‌గా మారింది.