జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌కు CBN హార్ట్ టచింగ్ రిప్లై

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-06 02:25:30.0  )
జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌కు CBN హార్ట్ టచింగ్ రిప్లై
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి విజయంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా, గత కొన్ని రోజులుగా టీడీపీ, చంద్రబాబు విషయంలో సైలెంట్‌గా ఉంటూ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కూటమి విజయంపై నిన్న ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రియమైన చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.. మీ ఈ విజయం ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.

అద్భుతమైన మెజారిటీ సాధించిన నారాలోకేష్‌కి, మూడో సారి ఘన విజయం సాధించిన బాబాయ్ బాలకృష్ణకి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్, పురంధరేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.’ ఈ ట్వీట్‌కు చంద్రబాబు తాజాగా బదులిచ్చారు. ‘థ్యాంక్యూ వెరీ మచ్ అమ్మ’ అని రిప్లై ఇచ్చారు. దీంతో టీడీపీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఖుష్ అవుతున్నారు. తమ అభిమాన హీరో ఇన్నాళ్లకు టీడీపీ విషయంలో పాజిటివ్‌గా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అభిమానులు సైతం జూనియర్ ఎన్టీఆర్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు.



Advertisement

Next Story