Anagani: క్యాస్ట్ ​స్టరిఫికెట్ మీ ఇంటికి​ అందలేదా.. అయితే ఇక్కడ దరఖాస్తు చేసుకోండి..

by Anil Sikha |   ( Updated:2025-03-02 07:45:33.0  )
Anagani: క్యాస్ట్ ​స్టరిఫికెట్ మీ ఇంటికి​ అందలేదా.. అయితే ఇక్కడ దరఖాస్తు చేసుకోండి..
X

దిశ, డైనమిక్​ బ్యూరో : మరో ఎన్నికల హామీని కూటమి ప్రభుత్వం నేరవేర్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ (anagani satyaprasad) తెలిపారు. రెవెన్యూ(revenue) యంత్రాంగం 28 లక్షల 62 వేల కుటుంబాలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను (caste certificate) అందజేసిందని ఆయన ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుమోటోగా రెవెన్యూ అధికారులే 34 లక్షల 37 వేల కుటుంబాల డేటాను పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపారన్నారు. వీఆర్వోలు ఇంటింటికెళ్లి శాశ్వత కులధ్రవీకరణ పత్రాలు అందజేశారని తెలిపారు. స్కూళ్లు, కాలేజీల్లో ప్రవేశాలకు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు, ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకునేందుకు కులధ్రువీకరణ పత్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తహశీల్దారు కార్యాలయాల చుట్టూ ఈ పత్రాల కోసం తిరగాల్సిన అవసరం లేదన్నారు. దాదాపు ఐదు లక్షల కుటుంబాలకు వివిధ కారణాల రీత్యా కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వలేదని వెల్లడించారు. వీరిలో ఎవరైనా అర్హులు ఉంటే గ్రామ, వార్డు సచివాలయాలు, (sachivalayam) ఏపీ మీసేవా కేంద్రాల (mee seva) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడక్కడే కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారని మంత్రి అనగాని వెల్లడించారు.

Next Story