- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: మంత్రి కొట్టు సత్యనారాయణకు సీఎంవో నుంచి పిలుపు
దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లిగూడెం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మంత్రి కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. అయితే కొట్టు సత్యనారాయణపై పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదన్ రావు అలియాస్ ఈలి నాని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిగూడెం అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
దీంతో తాడేపల్లి నియోజవర్గం నుంచి ఈలి నాని పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. శనివారం లేదా ఆదివారం వచ్చి సీఎం జగన్‌ను కలవాలని సత్యనారాయణకు సీఎంవో అధికారులు సమాచారం అందజేశారు. దీంతో ఈ పిలుపు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ‘అసలు మంత్రి కొట్టుకు సీఎంవోకు ఎందుకు పిలిచారు...?, ఈసారి మంత్రి కొట్టుకు టికెట్ రాదా..?, తాడేపల్లిగూడెం నుంచి మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పోటీ చేయబోతున్నారా..?. ఇటీవలే టీడీపీ నుంచి పార్టీలో చేరిన నానికి ఎలా టికెట్ ఇస్తారు..?’ అంటూ నియోజకవర్గం వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి కొట్టును కాదని ఈలి నానికి సీటు ఇస్తే సహకరించమని మంత్రి కొట్టు అనుచరులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.