- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ అంశం పై వాయిదా తీర్మానం ఇచ్చిన బుచ్చయ్య చౌదరి..తిరస్కరించిన స్పీకర్
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం అందరికి సుపరిచితమే. కాగా ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఇక ఈ రోజు కొనసాగుతున్న సమావేశాల్లో ప్రతిపక్ష నేతలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, అలానే వ్యవసాయ పంటల గిట్టుబాటు ధరల గురించి చర్చించాల్సిందిగా కోరుతూ గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటుగా టీడీపీ సభ్యులు స్పీకర్ కి వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు.
అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటుగా టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. కాగా అన్నదాత రైతన్న ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని టీడీపీ సభ్యులు కోరగా..దాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులు తామిచ్చిన వాయిదా తీర్మానం పై చర్చించాలని నినాదాలు చేసారు. అయితే టీడీపీ సభ్యుల నినాదాలను స్పీకర్ పట్టించుకోలేదు. రైతుల సమస్యలపై చర్చించాలని టీడీపీ సభ్యులు కోరుతూ నినాదాలు చేస్తున్న స్పీకర్ స్పందించకపోవడంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.