- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News: కేశినేని నాని పై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..
దిశ వెబ్ డెస్క్: టిడిపి అధిష్టానం విజయవాడ లోక్ సభ స్థానాన్ని కేసినేని చిన్నికి ఇచ్చిన నేపథ్యంలో బెజవాడ ఎంపీ కేసినేని నాని టిడిపికి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న వైసీపీ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు కేశినేని నాని. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేయడం టిడిపిలో చర్చినియాంశంగా మారింది. దీనితో పలువురు టిడిపి నేతలు కేశినేని నాని పై ఫైర్ అవుతున్నారు. ఇది వరకే కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని, నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.
అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న కూడా కేశినేని నాని పై విమర్శల జల్లు కురిపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడే మాటల్లో కేసినేని నానికి కూడా భాగం ఉన్నట్లు స్పష్టంగా తెలిసిపోయిందని పేర్కొన్నారు. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలను కూడా వెల్లంపల్లికి అనుకూలంగా పనిచేసేందుకే బ్లాక్ మెయిల్ చేసి మరి తీసుకున్నారని వెంకన్న విమర్శించారు. చంద్రబాబు మాటపై గౌరవం ఉండబట్టే ఇన్నాళ్లు ఆయన మౌనంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు ఎవరు చెప్పకనే నాని తన నిజస్వరూపాన్ని అందరికీ తెలిసేలా తానే చేసుకున్నారని వెంకన్న ఎద్దేవా చేశారు. ఇక కేశినేని కుటుంబ కలహాల్లో టిడిపికి ఎలాంటి సంబంధం లేదని.. ఈ విషయాన్ని కేశినేని నాని సోదరుడు కేసినేని చిన్నినే స్వయంగా చెప్పారని వెంకన్న పేర్కొన్నారు. కేశినేని నానికి టిడిపి అధిష్టానం రెండుసార్లు ఎంపీ టికెట్ ఇచ్చిందని.. అది కూడా మరిచిపోయి ఈరోజు కేశినేని నాని ఇలా మాట్లాడుతున్నారు అంటే అది నాని కుసంస్కారం అని.. ఏ ఎండకు ఆ గొడుగు పెట్టె స్వభావం కేసినేని నానిదని బుద్ధ వెంకన్న మండిపడ్డారు. ఇక అమరావతిని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని.. అలాంటి నాయకుడి దగ్గరికి నాని చేరడాన్ని ప్రజలు ఏ మాత్రం హర్షించరని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.