- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Breaking: మూడు రాజధానులని.. నిండా ముంచిన జగన్: ప్రధాని మోడీ సెన్సేషనల్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పి ప్రజలను నిండా ముంచేశారని సీఎం జగన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ముందు మూడు రాజధానాలుంటూ హడావుడి చేసిందని, చివరికి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారని ఆరోపించారు. ఎక్కడ చూసిన ఇసుక మాఫీయా ఇక యూపీఏ పాలనలో అన్ని కుంభకోణాలే జరిగాయని గుర్తు చేశారు. నేడు ఇండియా కూటమిలో ఉన్న నాయకులు ఈడీ.. ఈడీ అంటూ అరుస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న పాంతాల్లో నేతలు ప్రజా ధనాన్ని యథేచ్ఛగా లూఠీ చేస్తున్నారని ఆరోపించారు. ఆ డబ్బును గోదాంలలో భద్రపరుస్తూ పబ్బం గడుపుకుంటున్నాని ఫైర్ అయ్యారు. అందుకు ఊదాహరణ.. తాజాగా, జార్ఖండ్‌లోని కాంగ్రెస్ మంత్రి ఇంట్లో నోట్ల గుట్టలు బయపడటమేనని అన్నారు. ఏది ఏమైనా అలా దోపిడీకి పాల్పడిన వారిని ఎన్డీఏ సర్కార్ చూస్తూ ఊరుకోదని.. వారి నుంచి డబ్బును స్వాధీనం చేసుకుని ప్రజాహితానికి ఉపయోగిస్తామని మోడీ స్పష్టం చేశారు.