BIG BREAKING: మాజీ మంత్రి జోగి రమేష్‌కు బిగ్ షాక్.. కుమారుడు రాజీవ్ అరెస్ట్!

by Shiva |   ( Updated:2024-08-13 04:27:38.0  )
BIG BREAKING: మాజీ మంత్రి జోగి రమేష్‌కు బిగ్ షాక్.. కుమారుడు రాజీవ్ అరెస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రి గోల్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఇటీవలే కేసు నమోదైంది. ఈ మేరకు కేసులో ఏసీబీ మెరుపు వేగంతో దాడులు చేస్తూ అరెస్టులకు తెర లేపింది. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటిని మొత్తం తమ అధీనంలోకి తీసుకుని 15 మంది అధికారులు రమేష్ ఇంటిని జల్లెడ పట్టారు. సోదాల్లో పలు రికార్డులు, డాక్యుమెంట్లను వారు పరిశీలించారు. అనంతరం కేసులో కీలక వ్యక్తి అయిన జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. అందరూ కొనుగోలు చేసినట్లుగానే తాము కూడా భూమిని కొనుగోలు చేశామని అందులో తప్పేముందని అన్నారు. కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జోగి రాజీవ్ అన్నారు.

Advertisement

Next Story