- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: కరువు పరిస్థితులపై ప్రభుత్వం కీలక ప్రకటన.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న బీజేపీ
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరువు పట్టిపీడిస్తోంది. వానలు అనుకున్నంత మేర పడకపోవడంతో చాలా ప్రాంతాల్లో పంటలు పండే పరిస్థితి లేకుండా పోయింది. కొన్ని చోట్ల నాట్లు వేసినా అవి చేతికి రావడంలేదు. దీంతో కరువు తాండవం చేస్తోంది. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం 100 మండలాల్లో కరువు ఉందని ప్రకటించింది. కానీ వాస్తవిక పరిస్థితులు మరోలా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 400 మండలాలకు పైగానే కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 400 మండలాల్లో కరువు తాండవిస్తోందని, జగన్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సైతం కరువు పరిస్థితులపై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. అనకాపల్లి బీజేపీ నేతలతో సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ 400 మండలాల్లో కరువు ఉంటే 100 ప్రాంతాలను ప్రకటించడం మోసపూరితమని మండిపడ్డారు. కరువు పరిస్థితులపై ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించినా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇది రైతుల పట్ల జగన్ చిన్న చూపు చూస్తున్నారడానికి నిదర్శనం కాదా అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారంతా అభివృద్ధి నిరోధకులుగా మారారని విమర్శించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే అవినీతిలో కూరుకుపోయారని.. అందుకే విధ్వంసర, విద్వేష పాలన కొనసాగిస్తున్నారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని అగ్రస్థానంలో చేర్చేందుకు ప్రధాని మోదీ అన్ని రకాల సాయం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తున్నా రహదారులు నిర్మించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గుంత రోడ్లు ప్రజల ప్రాణాలు తీస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.