- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో బీజేపీకి బిగ్ షాక్: కీలక నేత రాజీనామా
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింంది. బీజేపీ విజయనగరం పార్లమెంట్ కన్వీనర్ గద్దె బాబూరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయనగరం జిల్లాలో పర్యటిస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గద్దె బాబూరావు తన నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. తన వ్యక్తిగత కారణాలతోనే బీజేపీకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనుకోని కారణాల వల్ల తాను టీడీపీని వీడి బీజేపీలోకి చేరినట్లు వెల్లడించారు. బీజేపీలో చేరిన మూడేళ్లలో పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసినట్లు తెలిపారు. పార్టీకి విధేయుడిగా అన్ని కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ప్రవర్తించానని ఏ తప్పుడు చేయకుండా బయటకు వస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నుండి బయటకు వచ్చినప్పుడు తాను ఏపార్టీని విమర్శించలేదని గుర్తు చేశారు. అయితే నా పోరాట పటిమా బీజేపీలో చాలామందికి నచ్చడంలేదు అనే విషయం అర్ధం అవుతుంది. ఈ జిల్లాలో బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి అని బీజేపీ అధిష్టానాన్ని అడిగాను. చీపురుపల్లి నియోజకవర్గంలో లక్ష ఓట్లు పైగా ఉన్న బీసీలు నన్ను కూడా వాళ్లలో ఒకడిగా చూస్తున్నారు. చీపురుపల్లి ప్రజలు రుణం తీర్చుకొలేనిది. వచ్చే జన్మ అంటూ ఉంటే చీపురుపల్లిలోనే పుట్టి మళ్లీ వాళ్ల రుణం తీర్చుకోవాలి అనేది నా కోరిక అని వెల్లడించారు. అభిమానులు, కార్యకర్తలు, నామకులతో సంప్రదించిన తర్వాతే పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఏ పార్టీలో చేరాలి అనేది కార్యకర్తలు, నాయకులు అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని గద్దె బాబూరావు వెల్లడించారు.