బీటెక్ రవికి బిగ్ రిలీఫ్: బెయిల్ మంజూరు

by Seetharam |
బీటెక్ రవికి బిగ్ రిలీఫ్: బెయిల్ మంజూరు
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ ఎమ్మెల్సీ,పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవికి ఊరట లభించింది. కడప మెజిస్ట్రేట్ కోర్టు బీటెక్ రవికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో బీటెక్ రవి నేటి సాయంత్రం కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇకపోతే బీటెక్ రవి పోలీసులతో వాగ్వాదం కేసులో ఈనెల 14 నుంచి రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరినెలలో కడప విమానాశ్రయం దగ్గర పోలీసులతో జరిగిన వాగ్వాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 10 నెలల అనంతరం బీటెక్ రవిని ఈ నెల 14న వల్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కడప జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా జనవరి 25న బీటెక్ రవి కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శించారు. అనంతరం యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు బీటెక్ రవి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి విమానాశ్రయకు వెళ్లారు. అయితే విమానాశ్రయంలో పలికి వెళ్లేందుకు బీటెక్ రవి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీటెక్ రవి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పది నెలల అనంతరం బీటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తోంది. పులివెందులలో బీటెక్ రవి రోజు రోజుకు బలపడుతుండటాన్ని తట్టుకోలేకపోయిన వైసీపీ కావాలనే అక్రమ కేసులు పెట్టి జైలుపాల్జేసిందని టీడీపీ ఆరోపణలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed