- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tirumala News:శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..టీటీడీ సంచలన నిర్ణయం
దిశ,వెబ్‌డెస్క్:తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం తో పాటు రూ.300, బ్రేక్ దర్శనం అందుబాటులో ఉంటుంది. వీఐపీలు, వీవీఐపీలు సిఫార్సు లేఖల పై ప్రత్యేక దర్శనం సదుపాయం కల్పిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఉంటుంది. ఈ సమయంలో భక్తలు సాధారణ రోజుల కంటే రెట్టింపు సంఖ్యలో వస్తారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అక్టోబర్‌లో పది రోజుల పాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలతో పాటు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుంచి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.