- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Achennayudu: మిర్చి రైతుల గురించి మీరు మాట్లాడటమా..!

దిశ, డైనమిక్ బ్యూరో : మిర్చి రైతుల గురించి వైసీపీ సభ్యులు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇవాళ ఆయన శాసనమండలిలో (Ap Assembly) వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో గుంటూరు మిర్చి యార్డు అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం రాగానే అవినీతిపై విచారణ చేశామని వెల్లడించారు. ఇక మిర్చి ధరలపై సీఎం చంద్రబాబు, తాను సమీక్ష చేశామన్నారు. మిర్చి రైతులకు లాభం రావాలని 5 గంటలసేపు చర్చించినట్లు తెలిపారు. మిర్చి ధరలపై ఎగుమతిదారులు, మిర్చి రైతులతోనూ (chilly) మాట్లాడినట్లు పేర్కొన్నారు. మిర్చి రైతులకు లాభం రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితోనూ సీఎం చంద్రబాబు (chandrababu) మాట్లాడారని తెలిపారు. మార్కెట్‍లో మిర్చికి రూ.11,500 ఉంటే, రూ.7,500కే కొనాలని జీవో ఇచ్చింది వైసీపీనేని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.