AP: పథకాలకు నిధుల నిలిపివేతపై పిటిషన్లు.. తీర్పు రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టు

by Shiva |   ( Updated:2024-05-09 14:54:18.0  )
AP: పథకాలకు నిధుల నిలిపివేతపై పిటిషన్లు.. తీర్పు రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఆదేశాలను సవాలు చస్తూ.. ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుమారు 5 గంటల పాటు న్యాయస్తానం విచారణ చేపట్టింది. ఈ మేరకు నిధుల విడుదల విషయంలో మరోసారి ఈసీకి విజ్ఞప్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా ఈసీ అభ్యంతరాలకు సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

కాగా, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రాకముందే జనవరి, మార్చి మధ్య కాలంలో ఆయా పథకాలకు అప్పుడే నిధులు విడుదల చేయకుండా, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎలా నిధులు విడుదల చేస్తారని కోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో ఈసీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిధుల విడుదలకు అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది. అందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది బదులిస్తూ... తాము కొత్త పథకాలు ప్రకటించడం లేదని, ఎప్పటి నుంచో నడుస్తున్న పథకాలకు మాత్రమే నిధులు విడుదల చేయాలనుకుంటున్నామని వాదించారు. అందుకు, ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ... ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక జూన్ 6న నిధులు విడుదల చేసుకోవాలని గతంలో సూచించామని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే విషయం చెబుతున్నాయని కోర్టు‌కు తెలిపారు. అనంతరం కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

Read More..

జగన్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

Advertisement

Next Story