AP NEWS: అద్భుతం.. నంద్యాలలో శివుడ్ని తాకిన సూర్య కిరణాలు

by Ramesh Goud |
AP NEWS: అద్భుతం.. నంద్యాలలో శివుడ్ని తాకిన సూర్య కిరణాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నంద్యాల జిల్లా(Nandyala District)లోని ఓ శివుడి గుడి(Lord Shiva Temple)లో అద్భుతం చోటు చేసుకుంది. ఈ అద్భుత దృష్యాన్ని చూసేందుకు భక్తులు(Devotees) పోటెత్తారు. ఆళ్ళగడ్డ(Allagadda) శిరివెళ్ల కేంద్రంలోని శ్రీ ఓంకారేశ్వర దేవాలయం(Om Kareshwara Temple)లో సూర్య కిరణాలు(Sun Rays) గర్భగుడిలో ఉన్న శివుడి విగ్రహాన్ని తాకాయి. ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు గుడి తలుపులు తెరవగా.. ఉదయం 6.30 గంటల సమయంలో దాదాపు 20 నిమిషాల పాటు సూర్య కిరణాలు శివుడిపై ప్రసరించాయి. దీంతో ఈ అద్భుత దృష్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చాయి. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయని భక్తులు తెలియజేస్తున్నారు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేయగా.. ఇది కాస్త వైరల్(Video Viral) గా మారింది. ఈ దృష్యాన్ని డైరెక్ట్ గా చూడలేకపోయిన భక్తులు ఈ విధంగానైనా చూసే భాగ్యం దక్కిందని సంతోషపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed