నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ, టెట్‌కు ఉచిత కోచింగ్

by srinivas |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ, టెట్‌కు ఉచిత కోచింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మెగా డీఎస్సీతో పాటు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు ప్రిపేరయ్యే నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మెగా డీఎస్సీ, టెట్ ఉచిత కోచింగ్ లోగోను అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రాపురంలో బ్లడ్ టెస్టులు చేసే లేబోరేటరీలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు దృష్టికి వచ్చిందని తెలిపారు. లేబోరేటరీల నిర్వాహకులు పద్ధతి మార్చుకోవాల్సిందేనన్నారు. అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధరలు నియంత్రించకపోతే రామచంద్రాపురంలో తానే ల్యాబ్, మెడికల్ షాపులు పెడతానని చెప్పారు. ప్రజలకు తక్కువ ధరలకే వైద్య పరీక్షలు, మందులు అందజేస్తానన్నారు. రామచంద్రాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు తాను కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఐదేళ్లలో స్వరాంధ్రను సాధిస్తామని వాసంశెట్టి సుభాష్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed