- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ సెంటిమెంట్ నినాదం.. చంద్రబాబు నోట కీలక ప్రకటన
దిశ, వెబ్ డెస్క్: గత ఎన్నికలకు ముందు ఏపీలో బీజేపీని టీడీపీ విభేదించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేతో కలిసి వెళ్తోంది. అయితే గత ఎన్నికల ముందు జరిగిన ఓ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు. స్పెషన్ స్టేటస్ అనేది ఆంధ్రుల సెంటిమెంట్ అని, అది అడిగితే బీజేపీ ఇవ్వలేదని, అందుకే తాను డిఫర్ అయ్యానని చెప్పారు. ఆ ఒక్కటి తప్ప బీజేపీతో తనకు ఎక్కడా అభిప్రాయ బేధాలు రాలేదని తెలిపారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు విభజన హామీలు అడుతున్నామని తెలిపారు. బీజేపీని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ విధంగా పరిష్కారం చూపుతారో చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇక అమరావతి రాజధానిపైనా ఆయన సంచలన వ్యా్ఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతినే అని బీజేపీ కూడా చెబుతోందన్నారు. అమరావతి రైతలు కోసం అప్పటి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ 10 ఏళ్ల పాటు Capital gains exemption ఇచ్చారని గుర్తు చేశారు. తమ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పోలవరం పనులు జరిగాయని, కానీ వైసీపీ వద్దని చెప్పిందని తెలిపారు. ప్రాక్టికల్ ఏమేమి సాధ్యమవుతాయో రాష్ట్రంలో ఉండే మేధావులంతా ఆలోచించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Read More..
‘ది లీడర్ రిటర్న్స్’ అంటూ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం..పక్కా వ్యూహంతో ప్రచారం
వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అక్కడి నుంచే ప్రకటన
సెంటిమెంట్ కోసం స్పెషల్ స్టేటస్ అడిగాను, ఇవ్వలేదు....differ అయ్యాను..అది తప్ప నాకు బీజేపీకి ఎక్కడ అభిప్రాయ బేధాలు లేవు.
— Gulte (@GulteOfficial) March 13, 2024
ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్...అన్ని కూడా అడుగుతున్నాం, వాళ్లని request చేస్తాం...దానికి ఏ విధంగా compensate చేస్తారో అని.
- #ChandrababuNaidu pic.twitter.com/tELbeq1HwO