నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ అంశాలపైనే ఫోకస్

by Rani Yarlagadda |
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ అంశాలపైనే ఫోకస్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. అలాగే రాజధాని అమరావతికి సంబంధించి.. గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుపై ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story