- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap: 175 స్థానాలపై బీఆర్ఎస్ ఫోకస్.. జగన్, చంద్రబాబుపై విమర్శలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లనున్నారు. ఈ మేరకు బలమైన అభ్యర్థుల కోసం వెతుకుతోంది. ఇప్పటికే పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరి ద్వారా మరికొంత మంది నేతలు బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఏపీ విభజన సమస్యలపైనే ఫోకస్ పెట్టిన ఆ పార్టీ గ్రౌండ్ లెవల్‌లోకి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే విశాఖలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ హామీల వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఇప్పటివరకూ విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలే కారణమనే విషయాన్ని బలంగా వినిపిస్తున్నారు. సీఎం జగన్‌తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కూడా ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
తాజాగా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ, టీడీపీ వైఫల్యమయ్యాయని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఏపీలో బీఆర్ఎస్ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఉంటుందని తోట చంద్రశేఖర్ తెలిపారు.