- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. గత ప్రభుత్వం చేసిన తప్పులు, ప్రస్తుతం సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం తరపున సభలో వినిపించారు. అయితే గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై జరిగిన దాడులపై నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే జగన్ సహా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కొద్దిసేపటికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగియడంతో అసెంబ్లీ సమావేశాలను మంగళవారానికి వాయిదా వేశారు.
అంతకుముందు గత ప్రభుత్వం చేసిన తప్పులపై ప్రస్తుత ప్రభుత్వం తరపున ఆయన అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘విభజనతో రాష్ట్రంలో లోటు బడ్జెట్ మిగిలింది. దీంతో రాష్ట్రం ఒడిదుడుకులకు లోనైంది. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేసింది. ప్రతీకార రాజకీయాలు చేసింది. విభజన అశాస్త్రీయంగా జరిగింది. దీంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. 2014-19 మధ్య రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయి. పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూడలేదు. 2019లో రాష్ట్రం అభివృద్ది దిశగా పరుగులు పెడుతున్న సమయంలో అధికారం మారింది. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులపై మూల ధన వ్యయం 56 శాతానికి పడిపోయింది.’’ అని గవర్నర్ నజీర్ పేర్కొన్నారు.