- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో ట్విస్ట్.. కేసు వాపస్ వెనుక సంచలన విషయాలు..?

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం టీడీపీ కార్యాలయం(Gannavaram Tdp Office)పై దాడి కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసును వాపస్ తీసుకుంటున్నట్లు ఫిర్యాదుదారుడు సత్యవర్థన్(Complainant Satyavarthan) కోర్టులో తెలిపిన విషయం తెలిసిందే. సాక్షిగా ఉన్న తనను పోలీసులు బెదిరించి తన నుంచి ఫిర్యాదు తీసుకున్నారని తెలిపారు. అయితే ఈ సత్యవర్థన్ యూటర్న్ తీసుకోవడం, తమపైనే నిందలు మోపడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. సత్యవర్థన్ యూటర్న్ తీసుకోవడంపై నిఘా పెట్టారు. ఈ మేరకు విచారణ జరిపారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కోర్టులో కేసు వాపస్ తీసుకోవాలని మూడు రోజుల క్రితం సత్యవర్థన్‌ను వల్లభనేని అనుచరులు బెదిరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. సత్యవర్థన్‌ను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు స్థానిక సీసీ టీవీ ఫుటేజుల్లో రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా నిందితులను గుర్తించారు. వాళ్లంతా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులుగా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు(MLA Gadde Rammohan Rao) మీడియా ముఖంగా స్పష్టం చేశారు. కోర్టులో అఫిడవిట్ ఇచ్చేందుకు రెండు రోజుల ముందే సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేశారని ఆయన చెప్పారు. సత్యవర్థన్‌ను కారులో తీసుకెళ్లారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని తెలిపారు. సత్యవర్థన్ కిడ్నాప్ చేసి కోర్టులో తప్పుడు అఫిడవిట్ ఇప్పించారని చెప్పారు. ఒక నేరం నుంచి తప్పించుకునేందుకు మరిన్ని నేరాలకు వంశీ పాల్పడ్డారని గద్దె రమ్మోహన్‌రావు తెలిపారు.
కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former MLA Vallabhaneni Vamsi)ని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వంశీ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. వంశీ ఇచ్చిన స్టేట్ మెంట్, ఆధారాలతో రిమాండ్ రిపోర్టును రెడీ చేస్తున్నారు.