Anakapalliలో లంచం మహమ్మారి.. అడ్డంగా బుక్కైన వీర్వో

by srinivas |   ( Updated:2023-02-04 11:08:46.0  )
Anakapalliలో లంచం మహమ్మారి.. అడ్డంగా బుక్కైన వీర్వో
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాస్ బుక్ జారీ చేసేందుకు ఓ అధికారి రూ.10 వేలు లంచం అడిగారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడు నుంచి సదరు అధికారి లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా పరవాడ తహశీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. పాస్ బుక్ జారీ విషయంలో ఓ వ్యక్తి నుంచి వీఆర్వో చలపతిరావు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. చేతులు తడపనిదే పని జరగదని తెగేసి చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అడిషనల్ ఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు అధికారులు వీఆర్వో చలపతిరావు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

Advertisement

Next Story