- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Velagamakulapally: దైవదర్శనానికి వెళ్తూ దంపతుల దుర్మరణం

X
దిశ, అనంతపురం: దైవదర్శనానికి వెళ్తూ దంపతులు మృతి చెందిన ఘటన సోమందేపల్లి మండలంలో చోటుచేసుకుంది. సోమందేపల్లి మండలం వెలగమాకులపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు వరలక్ష్మి (36), ఎర్రిస్వామి(45) దుర్మరణం చెందారు. మృతులు గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి గ్రామస్తులు. వీరిద్దరు పావగడ శనేశ్వర స్వామి దర్శనం కోసం బైకుపై వెళ్తుండగా వెలగమాకులపల్లి సమీపంలో టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story