- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మడకశిర టీడీపీలో తీవ్ర ఉద్రిక్తత.. అభ్యర్థి తండ్రిపై చెప్పుల దాడి
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ తొలి విడత అభ్యర్థుల జాబితా అనంతపురం జిల్లా మడకశిర ఆ పార్టీలో చిచ్చు రేపింది. ఈసారి ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్ కుమార్‌కు టికెట్ ఖరారు అయింది. ఈ మేరకు టీడీపీ తొలి జాబితాలో ఆయన పేరు ప్రకటించారు. దీంతో మడకశిర నియోజకవర్గంలో ఒక్కసారిగా అసమ్మతి చెలరేగింది. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న మధ్య కొంతకాలంగా వర్గ పోరు కొనసాగుతోంది. పైగా ఈరన్న తనయుడు సునీల్ కుమార్‌కే వచ్చే ఎన్నికల్లో సీటు దక్కడంతో తిప్పేస్వామి వర్గీయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
అయితే తనయుడు సునీల్ కుమార్‌కు సీటు దక్కడంతో మద్దతు కోరేందుకు మరకశిర పట్టణంలో తిప్పేస్వామి ఇంటికి మాజీ ఎమ్మెల్యే ఈరన్న వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే తిప్పేస్వామి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరన్నపై చెప్పులు విసిరారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో మడకశిరలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొంతసేపటికి ఈరన్న అక్కడి నుంచి వెళ్లిపోవడం వివాదం సర్దుమనిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో సునీల్ కుమార్‌కు సహకరించమని తిప్పేస్వామి వర్గం చెబుతుండటంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. గ్రూప్ పాలిటిక్స్ వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈరన్న, తిప్పేస్వామిని చంద్రబాబు ఎలా ఒక్కటి చేస్తారో చూడాలి.