- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CPI: సీఎం జగన్ కుంభకోణం రూ.100 కోట్లు
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం విక్రయాల్లో నెలకు రూ.100 కోట్లు కుంభకోణానికి పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంపై కేంద్రంలోని పెద్దలకు తెలిసినప్పటికీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
అనంతపురం సీపీఐ జిల్లా కార్యాలయంలో కే రామకృష్ణ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘ఆప్’ మంత్రి మనీశ్ సిసోడియాను రూ. 100 కోట్ల మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేసి 50 రోజులుగా జైలులోనే ఉంచారని ఇది ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. జగన్ మాత్రం మద్యంలో నెలకు రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. తనకు అనుకూలంగా ఉన్న జగన్‌కు ఓ రూలు, ప్రతిపక్షంలో ఉన్న సిసోడియాకు మరో రూలా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి కక్ష సాధింపు ధోరణిని గతంలో ఎప్పుడూ చూడలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని...వ్యవస్థలను నాశనం చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతూ రాజకీయ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు.
Also Read..
Amaravati R5 zone: ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఇవే..!