Mlc Elections: అనంతపురం జేఎన్‌టీయూ కౌంటింగ్ సెంటర్‌లో ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2023-03-17 16:08:36.0  )
Mlc Elections: అనంతపురం జేఎన్‌టీయూ కౌంటింగ్ సెంటర్‌లో ఉద్రిక్తత
X

దిశ, అనంతపురం: అనంతపురం JNTUలో నిర్వహిస్తోన్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సెంటర్‌లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక నవోదయ కాలనీ, నాయక్ నగర్ కాలనీ‌కి చెందిన కొంతమంది యువకులు కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడ్డారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు, కౌంటింగ్ కార్డులు లేకుండానే కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించారు. అంతేకాదు టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడి చేశారు. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో అరుపులు, కేకలతో కొద్దిసేపు కౌంటింగ్ నిలిచిపోయింది. ఇలా ఉద్రిక్తతలు, తోపులాట మధ్య జేఎన్టీయూలోని పట్టభద్రుల కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో పోలీసులు జోక్యం చేసుకొని ఇరవర్గాలను చెదరగొట్టి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.


ఇవి కూడా చదవండి:

Mlc Elections: స్వల్ప ఆధిక్యంలో వైసీపీ

Advertisement

Next Story